మ‌ళ్లీ ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా

మ‌ళ్లీ ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా

కేంద్ర హోం శాఖ‌ మంత్రి అమిత్ షా మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్‌ లో చేరారు. అమిత్ షాకు ఆగస్టు 2న కరోనా సోకగా.. ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఆగస్టు 14న అమిత్‌షాకు కరోనా నెగిటివ్‌గా రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం నాలుగు రోజుల్లోనే కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తడంతో.. ఆగస్టు 18న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి.. చికిత్స తర్వాత 31న డిశ్చార్జ్ అయ్యారు. అయితే అమిత్ షా తాజాగా శనివారం రాత్రి సుమారు 11గంటల తర్వాత ఏయిమ్స్‌లో చేరారు. ఇటీవలనే కోలుకున్న అమిత్ షా మళ్లీ శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆధ్వర్యంలో వైద్యులు అమిషాకు చికిత్స అందిస్తున్నారు. అమిత్ షా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఆస్ప‌త్రిలో చేరినట్లు తెలుస్తోంది.