పాకిస్తాన్‌లో షియా-సున్నీల మధ్య ఘర్షణ

Shia-Sunni conflict in Pakistan

పాకిస్తాన్‌లో షియా-సున్నీ వర్గాల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎవరికి వారు పైచేయి సాధించేందుకు వీలున్న అన్ని మార్గాలను ఎంచుకుంటూ ముందుకుపోతున్నారు. కరాచీ వీధుల్లో సున్నీ వర్గం వారు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వేలల్లో సున్నీ ప్రజలు రోడ్లపైకి వచ్చి షియా వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షియా ముస్లింలను చంపేస్తామంటూ బెదిరించాడు.
సోషల్ మీడియాలో కూడా ఈ పోరాటం కొనసాగుతున్నది. సోషల్ మీడియాలో # షియా జెనోసైడ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ ప్రారంభమైంది. ఇందులో సున్నీ వర్గానికి చెందిన ప్రజలు ఒకవైపు షియాస్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తుండగా.. మరోవైపు షియా వర్గానికి చెందిన ప్రజలు ఇస్లాం, మానవత్వాన్ని ఉటంకిస్తూ ఇటువంటి దాడులను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.
సున్నీలకు అండగా ఉగ్రవాద సంస్థగా ముద్రపడిన సిపా-ఏ-సహబా పాకిస్తాన్ (ఎస్‌ఎస్‌పీ) ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఇటీవల అషురా ఊరేగింపు మొహర్రం సందర్భంగా కొందరు షియా మత గురువులు ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారని ఓ వార్తా సంస్థ ఆరోపించింది. పాకిస్తాన్ సామాజిక కార్యకర్త ఆఫ్రీన్ దానిని ట్వీట్ చేయడంతో, అప్పటి నుంచి చాలా మంది షియా ముస్లింలు మత పుస్తకాలు చదివినందుకు, అషురా ఊరేగింపులో పాల్గొన్నందుకు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మీడియా నివేదికల ప్రకారం, పాకిస్తాన్లో షియా ముస్లింలపై హింస గత ఐదేండ్లల్లో గణనీయంగా పెరిగింది. ఈ సమయంలో వందల మంది షియా ముస్లింలు హత్యకు గురయ్యారు. హత్య తరువాత.. వారి ఇంటి వెలుపల "షియా ఆర్ కాఫీర్" అని కూడా వ్రాశారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు షియా వర్గానికి చెందిన ప్రజలను తొలుత సందేశాలతో బెదిరించి.. అనంతరం గ్రెనేడ్లతో దాడి చేసి చంపినట్లుగా పలు ఆరోపణలు ఉన్నాయి. షియా ముస్లింలపై హింసాకాండకు పాల్పడినట్లు ఉగ్రవాద సంస్థ ఎస్‌ఎస్‌పీపై కూడా ఆరోపణలు ఉన్నాయి. షియా వర్గం వారిపై హింసను కవర్ చేస్తున్న జర్నలిస్ట్ బిలాల్ ఫారూకిని పోలీసులు అరెస్టు చేసినట్లు ట్విట్టర్ యూజర్ ఒకరు .. ఇది షియాస్ ఊచకోత. మేము హింసించబడుతున్నాం అని రాశారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనికి నేరుగా బాధ్యత వహించాలన్నారు.