కరోనా పుట్టింది వ్యూహాన్ ల్యాబ్ లోనే

corona birth in Wuhan lab

ప్రపంచం మొత్తాన్ని ఆవహించి అందరి ఆర్థిక మూలాలు దెబ్బతీసి.. ఉద్యోగ ఉపాధి కోల్పోయేలా చేసిన కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్ లో పుట్టింది. అయితే అది ఎలా పుట్టిందనేది ఎవరికి తెలియదు. ప్రపంచవ్యాప్తంగా పాకి అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది.కరోనా వైరస్ ను పుట్టించిన చైనా మాత్రం ఇప్పటికే ఈ మహమ్మారి నుంచి బయటపడింది. శత్రుదేశమైన అమెరికా మాత్రం ఈ వైరస్ ధాటికి కకావికలం అయ్యింది.

మొదటి నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి చాలామంది చైనానే ఈ వైరస్ ను పుట్టించిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్ చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనమయ్యాయి.
చైనాలోని వూహాన్ లో కరోనా వైరస్ ను తయారు చేశారని.. వూహాన్ ల్యాబ్ లోనే ఈ ప్రయోగాలు చేసి పుట్టించారని చైనా వైరాలజిస్ట్ వెల్లడించారు. చైనాకు చెందిన ఒక మహిళా వైరాలజిస్ట్ 'లి మెంగ్ యాన్' చేసిన ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. కరోనా వైరస్ మానవులు సృష్టించిందేనని ఆమె అంటున్నారు.

తన వద్ద తగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని చైనా వైరాలజిస్ట్ లి మెంగ్ యాన్ చెప్పారు. ఈ వైరస్ గురించి చైనా చాలా విషయాలు దాచిపెడుతోందని..చైనా తయారు చేసిన వైరస్ ఇది అని ఆమె స్పష్టం చేశారు. నేను వాటిని నిరూపిస్తానని చెబుతోంది.

కరోనా వైరస్ వూహాన్ మాంసం మార్కెట్ నుంచి రాలేదని.. ఇది వైరస్ ప్రకృతి ఉత్పత్తి కాదని అన్నారు. ఈ వైరస్ జన్యు శ్రేణి మానవ వేలి ముద్రణ లాంటిదని.. మానవుల ఫింగర్ ఫ్రింట్ ఉండడం సరిపోతుందంటే అది మానవుల నుంచే ఉద్భవించిందని అర్తం అని చైనా వైరాలజిస్ట్ పేర్కొన్నారు. దీన్ని సృష్టించిన వైరస్ అని నిరూపిస్తానని వూహాన్ ల్యాబ్ నుంచి తయారు చేశారని వైరాలజిస్ట్ లి మెంగ్ యాన్ స్పష్టం చేసింది.

తనను హత్య చేయాడానికి కూడా చైనా ప్రయత్నిస్తోందని.. తప్పు అని నిరూపించడానికి ప్రచారం చేస్తోందని వైరాలజిస్ట్ లి మెంగ్ ఆరోపించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గనని ఆమె స్పష్టం చేశారు.