పబ్జీపై కేంద్రం నిషేధం 

పబ్జీపై కేంద్రం నిషేధం 

చైనాకు భార‌త్ మ‌రో షాక్ ఇచ్చింది. గతంలో గల్వాన్‌ లోయ వద్ద ఘర్షణల సమయంలో దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్‌టాక్‌ సహా అనేక యాప్‌లపై కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ నిషేధం విధిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. స‌రిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్ మ‌రోసారి బుద్ది చెప్పినట్లు అయ్యింది. పబ్జీ, పబ్జీ లైట్‌ యాప్‌లను ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా వినియోగదారులు వాడుతున్నారు. ఈ గేమ్‌కు యువత బానిసగా మారడంతో పబ్జీ గేమ్‌ను తొలగించాలని చాలాకాలంగా పలువురు కోరుతున్నారు.‌ ఇప్ప‌టికే కొన్ని యాప్ ల‌ను నిషేధించిన భార‌త్ డ్రాగన్‌ దేశానికి చెందిన మరో 118 మొబైల్‌ యాప్‌లపై నిషేధం విధించింది. వీటిలో పబ్‌జీ, క్యామ్‌ కార్డ్‌, బైడు, కట్‌కట్‌ సహా మొత్తం 118 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ వెల్లడించింది. మళ్లీ తాజాగా ఉద్రిక్తతల నేపథ్యంలో మరికొన్ని చైనా యాప్‌లపై కేంద్రం వేటు వేసింది.