ప్రణబ్ ముఖర్జీ పార్దివ దేహానికి మోడీ నివాళులు

ప్రణబ్ ముఖర్జీ పార్దివ దేహానికి మోడీ నివాళులు

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి పార్థివదేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి నుంచి 10 రాజాజీ మార్గ్‌లోని ఆయన నివాసానికి చేరుకోగానే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. అలాగే ప్రణబ్ పార్థివదేహం ముందుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్‌) బిపిన్ రావత్‌, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే, ఎయిర్‌ఫోర్స్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ నివాళులర్పించారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రణబ్ పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాన్ని ఉంచి అంజలి ఘటించారు. ప్రణబ్ పార్థివదేహానికి నమస్కరించి నివాళులు అర్పించారు. ఆ తర్వాత లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా 10 రాజాజీ మార్గ్‌లోని ప్రణబ్ నివాసానికి చేరుకున్నారు. ప్రణబ్ పార్థివదేహంపై పుష్పగుచ్చాలుంచి తుది నివాళులు అర్పించారు.