క‌రోనా సునామీ : భార‌త్ త‌ప్పించుకుంటుందా..?

will india  escape from Corona tsunami..?

క‌రోనా పంజా దెబ్బ‌కి మ‌నుషులు పిట్ట‌లు రాలిన‌ట్లు రాలిపోతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా 184 దేశాలు క‌రోనా క‌బంధ హ‌స్తాల్లో ప‌డి విల‌విల్లాడుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ సోకిన వారి సంఖ్య దాదాపు 2,60,000 దాట‌గా, 11 వేల మందికి పైగానే మృతి చెందారు. 

ఇక ఈ వైర‌స్ వ్యాప్తి క్ర‌మ క్ర‌మంగా పెరుగుతుండ‌డంతో, పాజిటివ్ కేసులు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయి. మ‌రి క‌రోనా దెబ్బ‌కి అగ్ర‌రాజ్యాలే వ‌ణికిపోతున్న వేళ‌.. మ‌రి సునామీల దూసుకు వ‌స్తున్న క‌రోనా నుండి భార‌త్ త‌ప్పించుకోగ‌ల‌దా, క‌రోనా వ్యాప్తిని అడ్డుకోగ‌ల‌దా అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.  

ప్ర‌స్తుతం ఇండియాలో క‌రోనా వైరస్ ప్ర‌భావం త‌క్కువ‌గానే ఉన్నా.. ఇక ముందు క‌రోనా వైర‌స్ వల్ల అత్యంత ప్రభావితమయ్యే దేశాల్లో భారత్ కూడా ఉండ‌వ‌చ్చ‌ని నిపుణులు అంచనా వేస్తున్నారు. మ‌న దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 350కి పైగానే క‌రోనా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. బ‌య‌ట‌ప‌డ‌నివి ఇంకెన్నో.. క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురు మృతి చెందారు. మహారాష్ట్ర‌లో ఇద్ద‌రు, క‌ర్నాట‌క‌లో ఒక‌రు, ఢిల్లీలో ఒక‌రు, పంజాబ్‌లో ఒక‌రు, బీహార్‌లో ఒక‌రు ఇలా ప్ర‌స్తుతానికి క‌రోనా వ‌ల్ల ఆరుగురు మ‌ర‌ణించారు. 

ఇత‌ర దేశాల్లో కరోనా మ‌ర‌ణాల సంఖ్య‌తో, ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య‌ను పోలిస్తే త‌క్కువ‌నే చెప్పాలి. అయితే ఇక‌ముందు క‌రోనా సునామీకి భార‌త్ సిద్ధంగా ఉండాల‌ని, ఇండియాలో క‌రోనా కేసులు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని, మ‌న‌దేశంలో క‌రోనా ప్ర‌భావం త‌క్కువ అయ్యేందుకు ఎలాంటి సంకేతాలు లేవ‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోవ‌డంలో, ఇత‌ర దేశాల‌తో పోలిస్తే, భార‌త్ మెరుగైన స్థితిలో ఉండ‌డానికి కార‌ణం.. ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు అద్భుతంగా ఉన్నాయని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌శంసించ‌డం విశేషం. మ‌రి క‌రోనా సునామీని నుండి మ‌న భ‌ర‌త జాతి ఎలా త‌ప్పించుకుంటుందో చూడాలి.