ఐపీఎల్ నుంచి సురేష్ రైనా ఔట్

ఐపీఎల్ నుంచి సురేష్ రైనా ఔట్

ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా ఐపీఎల్ ఆటల నుంచి తప్పుకున్నారు. తన వ్యక్తిగత కారణాల వల్ల తాను ఈ టోర్నీ నుంచి తప్పుకుంటు న్నట్లు రైనా ప్రకటించాడు. రైనా తప్పుకున్నట్లు సీఎస్కే జట్టు కూడా అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ జట్టుకు చెందిన పదిమంది క్రికెటర్లకు కరోనా సోకింది. తాజాగా రైనా కూడా తప్పుకోవడంతో సీఎస్కే జట్టుకు  పెద్ద దెబ్బ త‌గిలిన‌ట్లు అయ్యింది. ఐపీఎల్‌ 2020లో భాగంగా అందరికంటే ముందు ప్రాక్టీస్‌ మొదలుపెట్టాలని భావించిన సీఎస్‌కేకు వరస షాక్‌లు తగులుతున్నాయి. 
 దీంతో  సురేశ్ రైనా బ్యాటింగ్ చూడాలని అనుకున్న అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇంతకీ అతడు ఎందుకు వచ్చేశాడని అంతా ఆరా తీస్తున్నారు. ఈ విషయాన్ని సీఎస్‌కే జట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ‘‘ఈ ఐపీఎల్ సీజన్‌లో సురేష్ రైనా అందుబాటులో ఉండరు. వ్యక్తిగత కారణాలతో భారత్ తిరిగి వచ్చేశారు. ఈ సమయంలో అతడి కుటుంబానికి చైన్నై సూపర్ కింగ్స్ సంపూర్ణ ప్రోత్సాహం అందిస్తుంది’ అని పేర్కొంది. కాగా వారం రోజుల క్రితమే మ్యాచ్‌కోసం రైనా జట్టు సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో యూఏఈ వెళ్లారు.ఐపీఎల్ 2020 వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. యూఏఈలోని అబుదాబీ, దుబాయ్, షార్జా స్టేడియాలలో మ్యాచులు జరగనున్నాయి. మొత్తం 54 రోజుల పాటు సాగనున్న ఈ లీగ్ ఫైనల్ నవంబర్ 10న జరగనుంది.