జపాన్‌ ప్రధాని రాజీనామా

JAPAN PRIME MINISTER RESIGN TO HIS POST

జపాన్‌ ప్రధాని షింజో అబే రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల రీత్యా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయ సంక్షోభంలో జపాన్‌ కొట్టుమిట్టాడుతున్న సమయంలో సుస్థిరత తెచ్చిన నేతగా అబేకు గుర్తింపు ఉంది. షింజో అబే వయసు ప్రస్తుతం 65 సంవత్సరాలు. రోజురోజుకూ క్షీణిస్తున్న తన ఆరోగ్య పరిస్థితి పరిపాలనకు సమస్యగా మారకూడదని నిర్ణయించుకున్న షింజో అబే రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన గత కొన్నేళ్లుగా అల్సరేటివ్ కొలిటిస్‌తో బాధపడుతున్నారు. కాగా షింజో అబే పదవీ కాలం 2021 సెప్టెంబరు వరకు ఉంది.