టిక్‌టాక్‌ సీఈవో కెవిన్ రాజీనామా

టిక్‌టాక్‌ సీఈవో కెవిన్ రాజీనామా

టిక్ టాక్ సీఈవో కెవిన్‌ మాయర్‌ రాజీనామా చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో టిక్‌టాక్‌పై వ్యతిరేకత పెరిగిపోవడంతో ఆయన రాజీనామా చేశారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నుంచి టిక్‌టాక్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కెవిన్‌ ఈ నిర్ణయం తీసుకొన్నారు. టిక్‌టాక్‌పై తీవ్ర వ్యతిరేకత రావడంతో తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. దీనిపై ఓ సుదీర్ఘ లేఖను కూడా రాశారు. 'ఇటీవలి కాలంలో రాజకీయ వాతావరణ వేగంగా మారిపోయింది. ప్రపంచస్థాయిలో వ్యాపారానికి అవసరమైన మార్పులను చేశాం. 'ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతకు త్వరలోనే ఓ పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నా. మీమ్మల్ని విడిచి వెళ్లిపోవడం బాధగానే ఉంది' అంటూ పేర్కొన్నారు. కెవిన్‌ గతంలో డిస్నీలో పనిచేశారు. నాలుగు నెలల క్రితం టిక్‌టాక్‌ ఆయన్ను సీఈవోగా నియమించింది. అమెరికా రెగ్యులేటరీలకు అనుగుణంగా యాప్‌లో మార్పులు చేసి ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళతారని అంచనావేసింది. కానీ, ట్రంప్‌ సర్కారు టిక్‌టాక్ పై దాడిని పెంచింది. మరోపక్క బ్యాన్‌ను తప్పించుకోవాలంటే అమెరికాలో వ్యాపారాన్ని విక్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. షార్ట్ వీడియో ప్లాట్ ఫాంతో మార్కెట్లోకి అడుగు పెట్టి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్ల ఆదరణను టిక్‌టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.