మ‌రోసారి నిలిచిపోయిన జీ మెయిల్ సేవ‌లు 

మ‌రోసారి నిలిచిపోయిన జీ మెయిల్ సేవ‌లు 

జీ మెయిల్ సేవ‌లు మ‌రోసారి నిలిచిపోయాయి. జీమెయిల్ సేవలకు మరోసారి అంతరాయం కలిగింది. జీమెయిల్‌తోపాటు గూగుల్ డ్రైవ్ కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది. రెండు నెలల్లో జీమెయిల్ షట్‌డౌన్ అవ్వడం ఇది రెండోసారి. దాదాపు గంట నుంచి మెయిల్ పంపుతున్నా, ఫైల్స్ అటాచ్ చేస్తున్నా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. మెయిల్స్ ను పంపాలని చూస్తే చెక్ యువర్ నెట్‌వర్క్ అనే ఎర్రర్ మెసేజ్ వస్తోంది. దీంతో యూజర్లు గందరగోళానికి గురవుతున్నారు. ముఖ్యంగా జీమెయిల్‌ సహాయం సేవలు చేసే వారికి పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జీమెయిల్ డౌన్ అన్న హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా, జపాన్‌ తదితర దేశాల్లో జీమెయిల్ సేవలు ఆగిపోయాయి. ఇక ఈ విషయాన్ని గూగుల్ కూడా ధ్రువీకరించింది. మరోవైపు చర్యలను పునరుద్దరించే పనిలో గూగుల్ టీమ్‌ పడ్డట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన గూగుల్ టీమ్‌.. సమస్యను పరిష్కరించింది. జీమెయిల్ మాత్రమే కాదు... ఇతర జీసూట్ సర్వీసులైన గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్‌లో కూడా సమస్యలు ఉన్నాయని యూజర్స్ కంప్లైంట్ చేశారు.