ఆందోళ‌ణ క‌లిగిస్తున్న.. క‌రోనా వైరస్ లెక్క‌లు..!

Coronavirus is one of the fastest spreading in the world

క‌రోనా వైర‌స్ ఇప్పుడు యావ‌త్ ప్ర‌పంచానికి స‌వాల్ విసురుతోంది. ప్ర‌పంచ‌మంతా విస్త‌రిస్తూ ప్ర‌తి రోజు కొన్ని ప్రాణాల‌ను హరించి వేస్తుంది. అగ్ర‌రాజ్యాల‌కు సైతం స‌వాల్‌గా మారిన క‌రోనాను ఎదుర్కొనేందుకు స‌ర్వ‌శ‌క్తుల ఒడ్డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో, వేలమంది మ‌ర‌ణిస్తున్నారు. 

ఇక ఈ క‌రోనాను ప్ర‌పంచ దేశాలు తొలిద‌శ‌లోనే గుర్తించ‌లేక‌పోయారు. అదే జ‌రిగి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదు. మొద‌ట‌గా డిసెంబ‌ర్‌లో క‌రోనా వైర‌స్ ఉనికి పై ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చాయి. ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోవ‌డంతో అన్ని దేశాల్లో ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ లేక‌పోవ‌డం వ‌ల్ల క‌రోనా వైర‌స్ విప‌రీతంగా పెరిగిపోయింది.  

ఒక‌సారి క‌రోనా బారిన ప‌డ్డ‌వారు, ఇప్ప‌టికి మ‌ర‌ణించిన వారి లెక్క‌లు చూస్తే.. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 19 నాటికి 100 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఆ త‌ర్వాత ఒక్క నెల‌లోనే అంటే ఫిబ్ర‌వ‌రి 19 నాటికి కరోనా కేసులు సంఖ్య 76వేల‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం 183 దేశాల్లో క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డ‌వారి సంఖ్య 2.50 ల‌క్ష‌లు. ఈ లెక్క‌లు దిగ్భ్రాంతిని కూడా క‌లిగిస్తున్నాయి.   

ఇక జనవరి 22 నాటికి కరోనా వైర‌స్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 17.. ఆ త‌ర్వాత ఫ్రిబ్ర‌వ‌రి 20 నాటికి మ‌ర‌ణించిన వారి సంఖ్య 2,247కు చేరుకుంది. మార్చి 10 నాటికి 10,541 మంది మ‌ర‌ణించారు. ఈ లెక్క‌లు చూస్తే క‌రోనా ఎంత వేగంగా వ్యాప్తి చెందిదో  అర్ధ‌మ‌వుతోంది. చైనాలో పుట్టిన కరోనా వైర‌స్ కార‌ణంగా ఆ దేశంలోనే ఎక్కువ‌గానే మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఆ త‌ర్వాత ఇట‌లీ, స్పెయిన్, ఇరాన్ దేశాల్లో ఎక్కువ మంది మృతి చెందారు. అగ్ర‌రాజ్య‌మైన అమెరికాలోనూ క‌రోనా మృతుల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌డం ఆందోళ‌ణ క‌లిగిస్తోంది.