భార‌త్ లో 22 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు 

భార‌త్ లో 22 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు 

భార‌త్ లో క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తోంది. రోజురోజుకు క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య పెరుగుతుందే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. దేశంలో రికార్డుల స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. వ‌రుస‌గా నాలుగో రోజు 62 వేల‌కు పైగా పాజిటివ్ కేసుల‌తోపాటు, ఎనిమిది వంద‌ల‌కు పైగా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. తాజాగా రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా క‌రోనా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం మ‌ర‌ణాలు 44 వేలు దాటాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 1,007 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించారు. ఇంత‌పెద్ద సంఖ్య‌లో క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డం ఇదే మొద‌టి సారి. అదేవిధంగా నిన్న ఉద‌యం నుంచి ఈరోజు ఉద‌యం వ‌ర‌కు 62,064 మంది కొత్త‌గా క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 22,15,075కు పెర‌గ‌గా, మ‌ర‌ణాలు 44,386కు చేరాయి. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 6,34,945 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 15,35,744 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో క‌రోనా బారి నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 15 ల‌క్ష‌లు దాటింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది.