స్వ‌ర్ణ ప్యాలెస్ లో ర‌క్ష‌ణ ఏర్పాట్ల‌పై విచార‌ణ జ‌ర‌పాలి : ప‌వ‌న్ 

స్వ‌ర్ణ ప్యాలెస్ లో ర‌క్ష‌ణ ఏర్పాట్ల‌పై విచార‌ణ జ‌ర‌పాలి : ప‌వ‌న్ 

విజ‌య‌వాడ‌లోని  ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్‌ సెంటర్ లో ఇవాళ తెల్ల‌వారుజామున‌ ఘోర అగ్ని ప్రమాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే.  రమేశ్ హాస్పిటల్స్‌కు అనుబంధంగా వినియోగిస్తోన్న స్వర్ణపాలెస్‌ హోటల్లో నడుస్తున్న ఈ కరోనా కేంద్రంలో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్న విషయంపై విచారణ జరపాలని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిమాండ్ చేశారు. స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. కరోనా వైరస్‌తో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినవారు ప్రమాదం బారినపడటం అత్యంత విషాదకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు తమ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇతర హోటళ్లు, భవనాల్లోని కరోనా కేంద్రాల్లోనూ రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించాలని ఆయన అన్నారు.