స్వ‌ర్ణ ప్యాలెస్ ఘ‌ట‌న‌లో 11కు చేరిన మృతుల సంఖ్య 

 స్వ‌ర్ణ ప్యాలెస్ ఘ‌ట‌న‌లో 11కు చేరిన మృతుల సంఖ్య 

విజ‌య‌వాడ‌లోని స్వర్ణ ప్యాలెస్‌లో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగిన విష‌యం విదిత‌మే. ఈ ప్ర‌మాద ఘటనలో మొద‌ట ఏడు మంది చ‌నిపోగా.. ఇప్పుడు ఆ సంఖ్య‌ 11కు చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్వర్ణ ప్యాలెస్‌లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. 

 స్వ‌ర్ణ ప్యాలెస్ ఘ‌ట‌న‌లో 11కు చేరిన మృతుల సంఖ్య 

ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. తీవ్రంగా శ్రమంచి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. స్వర్ణ ప్యాలెస్‌ను రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్‌గా వినియోగిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 50 మంది ఉన్నట్లు తెలియవచ్చింది. బాధితులను లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్, కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించారు. దట్టంగా పొగ అలుముకోవడంతో బాధితులు శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  స్వ‌ర్ణ ప్యాలెస్ ప్ర‌మాద స్థ‌లాన్ని రాష్ట్ర డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ప‌రిశీలించారు. ఘ‌ట‌న‌పై అధికారుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకుంటున్నారు డీజీపీ.