భార‌త్ లో మ‌రోసారి రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు

భార‌త్ లో మ‌రోసారి రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు

భారత్ లో కరోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభణ కొన‌సాగుతోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది త‌ప్ప తగ్గ‌డం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజూ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా... భారత ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 64 వేల మందికి పైగా గత 24 గంటల్లో కరోనా బారిన పడ్డారు. 64,399 కరోనా కేసులు నమోదు కాగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఇరవై ఒకటిన్నర లక్షలు దాటాయి. ఇప్పటిదాకా ఇంత భారీగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య చూస్తే 21,53,011కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో 861 మంది చనిపోగా.. ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 43,379కు చేరింది. ఇక దేశంలో 6,28,747 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలానే ఇప్పటి వరకు కరోనా నుంచి 14,80,885 మంది కోలుకుని బయటపడ్డారు.