గుజరాత్‌లో దారుణం

HUGE FIRE ACCIDENT IN GUJARAT

గుజరాత్‌లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వల్సాద్‌ జిల్లా వ్యాపి నగరంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎనిమిది ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.