మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్

MINISTER MALLAREDDY EFFECTED BY CORONA

కరోనా వైరస్‌ మహ్మమారి ఏ ఒక్కరినీ వదలడంలేదు. తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కూడా ఈ జాబితాలో చేరారు.

తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్యుల సలహా మేరకు మంత్రి మల్లారెడ్డి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక, మల్లారెడ్డి కుటుంబసభ్యులకు, ఆయనకు సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించి కరోనా పరీక్షలు చేస్తున్నారు.