ఇండియాలో 200 దాటిన.. క‌రోనా పాజిటివ్ కేసులు..!

corona virus positive cases increases in india

ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైర‌స్ భారత్‌లో కూడా వేగంగా విజృంభిస్తోంది. అనేక ర‌కాల జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టినా,  మరణాలు ప్రమాదకర స్థాయిలో లేకున్నా, క‌రోనా మాత్రం చాప‌కింద నీరులా వేగంగానే విస్తరిస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. గురువారం ఒక్క‌రోజే దేశ వ్యాప్తంగా 53 న‌యా క‌రోనా కేసులు నమోదవ్వడం ఆందోళనకు గురిచేస్తోంది. గురువారానికి ఇండియాలో 167  కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవ్వాగా.. శుక్ర‌వారానికి 200 దాటింది. మొద‌ట మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్నాట‌క రాష్ట్రాల్లోనే అధికంగా క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, ఇప్పుడు ఢిల్లీ, యూపీ, రాజ‌స్తాన్, తెలంగాణ రాష్ట్రాల్లో క‌రోనా కేసులు రెండంకెల సంఖ్య‌కు చేరాయి. 

మ‌హారాష్ట్ర‌లో అయితే అత్య‌ధికంగా 49 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కేర‌ళ‌లో 26, ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో 22, ఢిల్లీలో 16, రాజ‌స్థాన్‌లో 15 పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి. మ‌రోవైపు తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నారు. తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 18 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో 3 కేసులు న‌మోదు అయ్యాయి. ఈ క్ర‌మంలో తాజాగా కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక‌ను విడుద‌ల చేసింది. ఇక క‌రోనా పాజిటీవ్ కేసుల్లో మృతుల సంఖ్య చైనాలోనే అధికం అనుకుంటే, తాజాగా ఇట‌లీ చైనాను బీట్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు చైనాలో 3245 మంది క‌రోనా వ్యాధి సోకి మ‌ర‌ణించ‌గా, ఇట‌లీలో 3405 మంది మృతి చెందారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైర‌స్ కారణంగా 10 వేల పైనే మరణాలు సంభవించినట్టు ఐక్యరాజ్యసమితి నివేదిక చెబుతోంది.