క‌రోనా వైద్యానికి రూ.10వేలు ఖ‌ర్చు : ఈట‌ల 

క‌రోనా వైద్యానికి రూ.10వేలు ఖ‌ర్చు : ఈట‌ల 

కరోనా వైద్యం ఖరీదైనది కాదని, కరోనా వైద్యానికి కేవలం రూ.10 వేల వరకు మాత్రమే ఖర్చు అవుతుందని తెలంగాణ ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఆయ‌న మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ప్రజల్లో కరోనా వైరస్ సోకితే భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతాయని అపోహ ఉంద‌న్నారు. కరోనా లక్షణాలను గుర్తించిన వెంటనే డాక్టర్ ను సంప్రదిస్తే వంద‌శాతం కరోనా వైరస్ బారి నుంచి బయట పడే అవకాశముంద‌ని తెలిపారు. క‌రోనా వైర‌స్ కు ఎంతో ఖ‌ర్చ‌వుతుంద‌న్న అపోహ‌ల‌ను విడ‌నాడాల‌న్నారు. కరోనా సోకగానే కంగారు పడి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఇబ్బంది పడకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాలని ఈటెల రాజేందర్ తెలిపారు.