షిప్‌యార్డ్ మృతుల‌కు రూ.50 ల‌క్ష‌ల ప‌రిహారం

షిప్‌యార్డ్ మృతుల‌కు రూ.50 ల‌క్ష‌ల ప‌రిహారం

విశాఖ హిందుస్తాన్ షిప్ యార్డులో శ‌నివారం ఉద‌యం ఓ భారీ క్రేన్ కూలిపోయిన ప్రమాదంలో పదిమంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాల‌కు ఒక్కో కుటుంబానికి 50లక్షలు, ఉద్యోగ అవకాశం ఇస్తున్నామని రాష్ర్ట మంత్రి అవంతి శ్రీ‌నివాస్ రావు అన్నారు. మంత్రి అవంతి శ్రీ‌నివాస్ రావు షిప్‌యార్డులోని ప్ర‌మాదస్థ‌లాన్నిఇవాళ‌ ప‌రిశీలించారు. షిప్‌యార్డు యాజ‌మాన్యం, కాంట్రాక్ట్ సంస్థ‌ల‌తో మంత్రి స‌మావేశమై చ‌ర్చించారు. ప్ర‌మాదం జ‌రిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... షిప్‌యార్డు ప్ర‌మాదం దుర‌దృష్ట‌క‌రమ‌న్న మంత్రి ఘ‌ట‌న‌పై కొంద‌రు నేత‌లు దుష్ర్ప‌చారం చేస్తున్నారని మండిప‌డ్డారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా మారుతున్న నగరం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ చర్యలు దురదృష్టకరమని మంత్రి అవంతి అన్నారు. విశాఖ షిప్‌యార్డ్ మృతుల కుటుంబాల‌కు ఒక్కో కుటుంబానికి రూ. 50 ల‌క్ష‌లు న‌ష్ట‌ప‌రిహారంగా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా మృతుల కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగం క‌ల్పించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.