తెలంగాణ రాష్ట్ర బీజేపీ క‌మిటీ ఏర్పాటు 

తెలంగాణ రాష్ట్ర బీజేపీ క‌మిటీ ఏర్పాటు 

భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ రాష్ట్ర‌ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాత, కొత్త కలయికల‌తో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఈసంద‌ర్భంగా బండి సంజ‌య్ మాట్లాడుతూ... రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు నూతన కార్యవర్గం కృషిచేయాలని‌ కోరారు. పార్టీలో ప‌నిచేసే అంద‌రికీ గుర్తింపు ఉంటుంద‌న్నారు. అనంత‌రం ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, ఎనిమిది మంది కార్యదర్శులను నియమించారు. రాష్ట్ర కమిటీతోపాటు పార్టీ అనుబంధ మోర్చాలకు అధ్యక్షులను ప్రకటించారు. అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, యెండాల లక్ష్మీనారాయణ, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మోహన్‌రెడ్డి, బండారు శోభారాణి నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు.