భార‌త్ లో మ‌రో 54,736 క‌రోనా కేసులు 

భార‌త్ లో కొత్త‌గా 54,736 క‌రోనా కేసులు 

భార‌త్ లో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం చూపిస్తోంది. రోజురోజుకు క‌రోనా కేసులతో పాటు మ‌ర‌ణాలు కూడా అత్య‌ధిక‌ స్థాయిలో న‌మోద‌వు తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 54,736 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 17,50,724 కి చేరింది.  ఇందులో 5,67,730 కేసులు యాక్టివ్ గా ఉంటె, 11,45,639 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 853 మంది మరణించారు. దీంతో ఇండియాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 37,324కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 4,63,172 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 1,98,21,831 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దేశంలో గత మూడు రోజులుగా ప్రతిరోజూ అర లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు వేగంగా విస్తరిస్తుండ‌డం, క‌రోనా నియంత్ర‌ణ‌కు మందు రాక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.