మోహ‌న్ బాబు నివాసం వ‌ద్ద క‌ల‌క‌లం : దుండగుల గుర్తింపు

మోహ‌న్ బాబు నివాసం వ‌ద్ద క‌ల‌క‌లం : దుండగుల గుర్తింపు

 ప్ర‌ముఖ సినీ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద కొందరు దుండగులు తీవ్ర భయాందోళనలు రేకెత్తించారు. హైదరాబాదులోని ఆయ‌న‌ నివాసంలోకి ఓ కారులో దూసుకెళ్లిన దుండగులు మిమ్మల్ని వదలబోమంటూ ఆయన కుటుంబ సభ్యులను హెచ్చరించారు. మోహన్ బాబు ఇంటి సెక్యూరిటీ సిబ్బంది ఆదమరిచి ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇన్నోవా కారు ఆయన ఇంట్లోకి దూసుకెళ్లింది. అందులో నలుగురు వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు. వారు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పిమ్మట మళ్లీ అదే కారులో వెళ్లిపోయారు. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన మోహన్ బాబు కుటుంబ సభ్యులు పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు ఇంటికి వెళ్లి మరీ హెచ్చరించింది ఎవరన్నది ఆసక్తికర అంశంగా మారింది..
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని గుర్తించారు. వారు మైలార్ దేవ్ ప‌ల్లి దుర్గా నగర్ ప్రాంతానికి చెందిన యువకులుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా, దుండగులు విజయలక్ష్మి అనే మహిళ పేరుపై రిజిస్టర్ అయిన ఏపీ 31 ఏఎన్‌ 0004 ఇన్నోవా కారులో మోహన్ బాబు ఇంటిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.