కువైట్ లో తెలుగువాళ్ళ నరకయాతన

TELUGU PEOPLE ARE AT CRITICAL POSITION IN KUWAIT

బతుకు తెరువు కోసం కువైట్‌ వెళ్లిన తెలుగు రాష్ట్రాల వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. వారితో పాటు తమిళనాడు, బీహార్‌ వాసులు కూడా కరోనా ప్రభావంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నిజామాబాద్‌, కామారెడ్డి, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల వాసులు ఐదు నెలలుగా జీతాలు లేక కువైట్‌లో కష్టాలు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో రూముల్లోంచి బయటకు వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. వసతులు లేక విలవిల్లాడుతున్నారు. కనీసం భోజనం, నీళ్లు ఇప్పించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. భారత్‌కు రప్పించాలని సెల్పీ వీడియోలు ద్వారా వేడుకుంటున్నారు.
అక్కడ కంపెనీలు పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వదేశానికి రప్పించాలని వేడుకుంటున్నారు.