కరోనా భయంతో వృద్ద దంపతుల ఆత్మహత్య

OLD COUPLE COMMITS SUICIDE

పంజాగుట్ట పిఎస్ పరిధిలోని ఎంఎస్ మక్తాలో ఇద్దరు వృద్ద దంపతుల ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఖైరతాబాద్ డివిజన్ రాజేంద్రనగర్ స్ట్రీట్ నెంబర్ 3లో ఇద్దరు వృద్ద దంపతులు నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

కరోనా సోకిందనే భయంతోనే వారు ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు. శీతల పానియంలో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మ్యహత్య చేసుకుని చనిపోయినట్టు చెబుతున్నారు. మృతులు వెంకటేశ్వర నాయుడు, భార్య లక్ష్మీగా గుర్తించారు. తమకు కరోనా సోకిందని అది తమ కుటుంబ సభ్యులకి కూడా సోకుతుందని భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు, క్లూస్ టీం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.