కొరటాల దర్శకత్వంలో బన్ని

allu arjun act in koratala direction

అల వైకుంఠపురంలో విజయంతో మంచి ఊపు మీదున్న అల్లు అర్జున్, అదే ఉత్సహంతో వరుస సినిమాలుతో తన అభిమానులని అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ "పుష్ప" కి సంబంధించిన వివిధ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మరో క్రేజీ సినిమాతో బన్ని, ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. 

వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కొరటాలశివ తో కలిసి సినిమా చేయబోతున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.