దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం

దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం

ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఇంటి విషాదం చోటు చేసుకుంది. శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య (89) ఇవాళ‌ ఉదయం అనారోగ్యంతో ఆసుపత్రిలో క‌న్నుమూశారు. వయసు పైబడటంతో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జ‌రుగుతాయ‌ని కుటుంబ సభ్యులు తెలిపారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో శేఖ‌ర్ క‌మ్ముల అనేక సేవా కార్యక్ర‌మాలు చేశారు‌. హిజ్రాల‌కి నిత్యావ‌స‌రాలు అందించ‌డంతో పాటు జీహెచ్ఎంసీ కార్మికుల‌కి నెల రోజుల పాటు మ‌జ్జిగ‌తో పాటు ఆరోగ్యానికి సంబంధించిన‌వి అందించారు. ప్లాస్మా దానం చేయాల‌ని కూడా కోరుతున్నారు. రొమాంటిక్ చిత్రాల‌కి కేరాఫ్ అడ్రెస్ గా మారిన శేఖ‌ర్ క‌మ్ముల ప్ర‌స్తుతం ల‌వ్ స్టోరీ అనే చిత్రాన్ని చేస్తున్నారు. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో ఈ చిత్రం రూపొందుతుంది.