ఏపీకి వెళ్లేందుకు ఆటోమెటిక్ ఈపాస్ లు 

ఏపీకి వెళ్లేందుకు ఆటోమెటిక్ ఈపాస్ లు 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీకి వచ్చేవారు స్పందన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆటోమేటిక్‌ ఈపాస్‌, గుర్తింపు కార్డు జారీ చేస్తామని ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికుల అనుమతి నిబంధనల్లో ఈ సడలింపులు చేసింది. అన్‌లాక్‌ 3 నిబంధనల మేరకు వీటిని సడలించినట్లు అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆటోమెటిక్‌ ఈపాస్‌ జారీకి నిర్ణయించారు. స్పందన వెబ్‌సైట్‌లో పాస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈపాస్‌ జారీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే ప్రయాణికుడి మొబైల్‌, ఈమెయిల్‌కు పాస్‌ పంపనున్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఈపాస్‌తోపాటు గుర్తింపు కార్డు చూపించి రాష్ట్రంలోకి ప్రవేశించవచ్చని ప్రభుత్వం తెలిపింది. రేపటి నుంచి ఆటోమేటిక్‌ ఈపాసులు జారీ చేయనున్నట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద నమోదు చేసుకున్నవారి వివరాలను స్థానిక సిబ్బందికి ఇస్తామని చెప్పారు. ప్రయాణికుల ఆరోగ్యస్థితిని నిరంతరం పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ... ఆగస్ట్ 1 నుంచి అన్‌లాక్ 3 ప్రారంభించడంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు.