ఫోన్ కొనివ్వ‌లేద‌ని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

ఫోన్ కొనివ్వ‌లేద‌ని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

క‌రోనా వైర‌స్ లాక్‌డౌన్ నేప‌థ్యంలో నిరుపేద విద్యార్థుల‌కు స్మార్ట్‌ఫోన్లు లేక‌పోవ‌డంతో.. ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు ఇబ్బందిక‌రంగా మారింది. దీంతో స్మార్ట్‌ఫోన్లు లేక‌, క్లాసులు విన‌లేక స‌త‌మ‌త‌మై క్ష‌ణికావేశంలో ప్రాణాల‌ను తీసుకుంటున్న ఘ‌ట‌న‌లు చోటుచేసు కుంటున్నాయి. తాజాగా త‌మిళ‌నాడు రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తికి చెందిన‌ విద్యార్థి ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు. రాష్ట్రంలోని కుడ‌లూరు జిల్లాకు చెందిన ఓ 14 ఏళ్ల విద్యార్థి ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. లాక్ డౌన్ సంద‌ర్భంగా త‌మిళ‌నాడులో స్కూళ్ల‌న్నీ ఆన్‌లైన్ క్లాసుల‌ను ప్రారంభించాయి. అయితే ఈ విద్యార్థికి స్మార్ట్‌ఫోన్ లేక‌పోవ‌డంతో క్లాసుల‌ను విన‌డం లేదు. త‌న‌కు ఫోన్ కొనివ్వ‌మ‌ని తండ్రిని అడిగాడు. జీడిప‌ప్పు పండించే ఆ విద్యార్థి తండ్రి.. అది అమ్ముడుపోగానే ఫోన్ కొనిస్తాన‌ని చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్ర‌హానికి గురై క్ష‌ణికావేశంలో ఇంట్లోనే ఉరేసుకుని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.