భార‌త్ లో కొత్త‌గా 57,117 క‌రోనా కేసులు

భార‌త్ లో కొత్త‌గా 57,117 క‌రోనా కేసులు

భార‌త్ లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు ..అలాగే క‌రోనా మ‌ర‌ణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా.. గత 24 గంటల వ్యవధిలో 57,117 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా నిర్ధారణ అయినవారి సంఖ్య 16,95,988కు చేరింది. వీరిలో 5,65,103 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 10,94,374 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే దేశంలో 5,25,689 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 64.53 శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 36,569 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక కొత్తగా 764 మరణించడంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 36,511కు పెరిగింది. ప్రస్తుతం మరణాల రేటు 2.15 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. కరోనా మరణాల్లో భారత్ ఇప్పటికే ఇరాన్‌ను దాటేసి, అత్యధిక మరణాలు నమోదవుతున్న దేశాల్లో ఐదో స్థానంలో నిలిచింది.