కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలి

human rights members demands to bring Covid-19 treatment under Aarogyasri

కోవిడ్‌19ను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్‌ ఫిర్యాదు చేశారు. ఈమేరకు గురువారం ఆయన ఆన్‌లైన్‌ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినా పట్టించుకోలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదనీ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఫీజుల నియంత్రణ జీవో నెం 248 ప్రయివేట్‌ ఆస్పత్రులు తుంగలో తొక్కి రోగులు నుంచి లక్షలాది రూపాయలు లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.