రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ, సీఆర్డీఏ ర‌ద్దు బిల్లుల‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం 

రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ, సీఆర్డీఏ ర‌ద్దు బిల్లుల‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం 

ఏపీ గ‌వ‌ర్న‌ర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదంతో మూడు రాజ‌ధానుల‌కు లైన్ క్లియ‌ర్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు సంబంధించి రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. అలాగే సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఓకే చెప్పారు. ఈ రెండు బిల్లులకు రాజ్ భవన్ నుంచి ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. దీన్ని ఏపీ శాసనసభ ఆమోదించింది. అయితే, మొదటిసారి ఏపీ శాసనమండలిలో ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ ప్రకటించారు. అయితే, మూడు నెలలు గడిచిన తర్వాత మరోసారి అవే బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో రెండోసారి ఆమోదించి మండలికి పంపింది. అక్కడ బిల్లులపై ప్రతిపక్ష టీడీపీ అభ్యంతరం తెలిపింది. కానీ, నిబంధనల ప్రకారం గడువు ముగిసిన తర్వాత బిల్లులను శాసనసభ కార్యాలయం గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్‌కు పంపింది. ఈ బిల్లుల మీద గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. బిల్లుల‌పై గవ‌ర్న‌ర్ న్యాయ‌శాఖ అధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన గ‌వ‌ర్న‌ర్ రెండు బిల్లులకు ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్రానికి జ్యుడీషియ‌ల్ రాజ‌ధానిగా క‌ర్నూలు, ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానిగా విశాఖ‌, శాస‌న రాజ‌ధానిగా అమ‌రావ‌తిల‌కు ఆమోద‌ముద్ర ప‌డింది.