వెంక‌య్యనాయుడును క‌లిసిన సోము వీర్రాజు 

వెంక‌య్యనాయుడును క‌లిసిన సోము వీర్రాజు 

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత సోము వీర్రాజు తొలిసారి ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిశారు. రాష్ట్ర అధ్యక్షులుగా తనను ప్రకటించిన తర్వాత ఉపరాష్ట్రపతి గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ ను కూడా సోము వీర్రాజు కలిశారు. ఈ భేటీకి సంబంధించి ఆయన ట్వీట్ చేస్తూ, 'రామ్ మాధవ్ ను ఎప్పుడు కలిసినా ఒక గొప్ప వ్యక్తితో నాకు మంచి అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంటుందని అన్నారు.
అలాగే కురిచేడు దుర్ఘటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణ జరపాలని కోరారు.ఇంకా మృత్యువుతో పోరాడుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని విన్నవించారు.