ప్లాస్మా థెర‌పీ దానం చేస్తే రూ.5వేలు : జ‌గ‌న్ 

ప్లాస్మా థెర‌పీ దానం చేస్తే రూ.5వేలు : జ‌గ‌న్ 

రాష్ట్రంలో కరోనా బాధితులకు ఫ్లాస్మా థెరపీ దాతకు రూ.5000 ఇవ్వాలని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలిపారు. ఇవాళ‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌ కట్టడి, ఆస్పత్రుల్లో వైద్యం, విద్యావ్యవస్థ నాడు-నేడు పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, ప్రభుత్వ రోడ్డు ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌత‌మ్ సవాంగ్‌, హెల్త్‌ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.... జీజీహెచ్‌ లాంటి ఆస్పత్రులపై మరింత శ్రద్ధపెట్టాలి. ఆస్పత్రులపై దృష్టి సారించేలా జేసీలకు బాధ్యత ఇవ్వాలని అన్నారు. కరోనాలాంటి విపత్తులను భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే.. మూడేళ్లలో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.ప్లాస్మా థెరఫీ విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కోవిడ్‌పై అవగాహన కల్పించడానికి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో బెడ్స్‌ దొరకని పరిస్థితి ఉండరాదని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో భర్తీ వివరాలు ఆస్పత్రి హెల్ప్‌ డెస్క్‌లో అందుబాటులో ఉంచాలని, ఎవరికైనా బెడ్‌ అందుబాటులోకి లేదంటే సమీపంలోని ఆస్పత్రిలో బెడ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. హెల్ప్‌ డెస్క్‌లో ఉన్నవారికి ఓరియంటేషన్‌ బాగుండాలని సూచించారు. అధికారులు సూక్ష్మస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, బెడ్లు, వైద్యం, ఆహారం, పరిశుభ్రత బాగుందా లేదా అన్నదానిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.