హోం క్వారంటైన్‌లోకి నాగాలాండ్ ముఖ్య‌మంత్రి 

హోం క్వారంటైన్‌లోకి నాగాలాండ్ ముఖ్య‌మంత్రి 

దేశ‌వ్యాప్తంగా రోజురోజుకు క‌రోనా వైర‌స్ కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోంది. రోజుకు 40వేల‌కు పైగా క‌రోనా కేసులు దేశ‌వ్యాప్తంగా న‌మోదవుతున్న విషయం తెలిసిందే. క‌రోనా ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. సామాన్యులు మొద‌లుకొని డాక్ట‌ర్లు, పోలీసులు, ప్ర‌ముఖులు, ప్ర‌జాప్ర‌తినిధులు ఇలా ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. ఇటీవ‌లే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వైరస్ బారిన పడ్డారు. దేశంలోనే కరోనా బారిన పడిన మొట్టమొదటి సీఎం చౌహాన్. అయితే ప్రస్తుతం ఆయన కరోనా పాజిటివ్ కారణంగా క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే తాజాగా నాగాలాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్లో పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో సీఎం నీఫియు రియో హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. కరోనా సోకిన సీఎం ఇంటి ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు. సీఎం ఇంటిని శానిటైజ్ చేసి 48 గంటల పాటు సీఎం క్యాంప్ కార్యాలయాన్ని మూసివేశారు. ముందుజాగ్రత్త చర్యగా కరోనా సోకకుండా సీఎంతోపాటు సీఎం కార్యాలయ అధికారులు హోం క్వారంటైన్ లోకి వెళ్లామని నాగాలాండ్ సీఎంవో ట్వీట్ చేసింది. సీఎం సిబ్బందితో పాటు 53 మందికి కరోనా సోకింది.