అమెరికాలో లక్ష యాభైవేల కరోనా మరణాలు

one lakh fifty thousand people are died in america by corona

అమెరికాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. దేశంలో కరోనా మరణాలు 1,50,000 దాటాయి. ఇతర దేశంలోని మరణాలు కంటే ఇవి ఎక్కువ మాత్రమే కాదు, ప్రపంచంలో మరణాల్లో నాలుగువంతు కంటే ఎక్కువ. అమెరికాలో గత 11 రోజుల్లోనే 10 వేలకు పైగా మరణాలు సంభవించాయి. బుధవారం కేవలం ఫ్లోరిడాలోనే 217 మంది మృతి చెందారు. మే 27నాటికే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరింది.

న్యూయార్క్‌లో అత్యధికంగా 32 వేల మంది మృతి చెందారు. అధికారులు ముందుగా వేసిన అంచనా ప్రకారం జులై నాటికి 81 వేల మంది కరోనాతో మృతి చెందుతారని భావించారు. అయితే వాస్తవంలో అంతకు రెట్టింపు మంది మరణించడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.