కరోనాతో కామెడీలొద్దు

people are neglect to corona

కరోనాతో ఓ వ్యక్తి చనిపోతే, ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు, గ్రామస్థులు సుమారు 60 మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగలో చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ వ్యక్తి(63)కి ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్ష చేయించగా పాజిటివ్‌ వచ్చింది. వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వైద్యులు మృతదేహాన్ని ప్యాక్‌ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు నిబంధనలు పాటించకుండా దహన సంస్కారాలు నిర్వహించారు. మృతదేహానికి ఉన్న కవర్‌ను తొలగించి, ముఖాన్ని కడిగి, ఇతర కార్యక్రమాలు పూర్తిచేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
ఆ తర్వాత మృతి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తెలియడంతో బంఽధువులు, గ్రామస్థులు సుమారు 60 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిసింది. గ్రామంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించారు. పరీక్ష ప్రైవేట్‌ ల్యాబ్‌లో చేయించినందున వైద్య ఆరోగ్య శాఖలో ఈ కేసు నమోదు కాలేదు.