ఇంకా రోగితోనే పోరాటం చేస్తున్నారు

corona patients dead bodies are not collected

కరోనా బారిన పడి ఆస్పత్రిలో చనిపోతే వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు ఇష్టపడటం లేదు. 85 ఏళ్ల వృద్ధురాలు ఎంజీఎంలో మృతి చెందితే ఎవ్వరూ రాలేదు. కాజీపేటకు చెందిన 50 ఏళ్ల వయసున్న ఇద్దరు పురుషులు, 64 ఏళ్ల మహిళ మృతదేహాలు 4 రోజులుగా ఎంజీఎంలోనే ఉన్నాయి.

ఫోన్‌ చేస్తే కొందరు 'మాకు డెత్‌ సర్టిఫికెట్‌ ఇస్తేచాలు. మిగిలిన కార్యక్రమాలన్నీ మీరే చేయండి' అని; ఇంకొందరేమో 'దహనం అయిందని ఫోన్‌ చేస్తే స్నానాలు చేసి దీపం ముట్టించుకుంటాం' అని చెప్పారని ఎంజీఎం సిబ్బంది వెల్లడించారు.