చేతబడి నెపంతో మహిళ దారుణ హత్య

worse incident in maharashtra

మంత్రగత్తె అనే అనుమానంతో ఓ వ్యక్తి(35) తన పొరుగింటి మహిళ(45)ను చంపాడు. ఈ అమానుష ఘటన మహారాష్ట్ర చేతబడి నెపంతో మహిళన ని థాణె జిల్లా కల్యాణ్ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సదరు వ్యక్తి భార్య ఏనిమిది రోజులక్రితం చనిపోయింది. కాగా పొరుగుంటి మహిళ చేతబడి చేయడంతోనే తన భార్య చనిపోయినట్లుగా అతడు అనుమానపడ్డాడు. దీంతో మంగళవారం సాయంత్రం మహిళను ఆ వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.
చుట్టుప్రక్కలవారు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.