ఘర్షణ సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రానా

rana act in gharshana sequel

వెంకటేష్‌ కథానాయకుడిగా గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో రూపొందిన 'ఘర్షణ' చిత్రం శక్తివంతమైన పోలీస్‌ కథ, ైస్టెలిష్‌ మేకింగ్‌తో ప్రేక్షకుల్ని మెప్పించింది. డీసీపీ రామచంద్రగా వెంకటేష్‌ నటన విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ చిత్రం విడుదలై గురువారంతో (జూలై 30) 16 ఏళ్లు పూర్తయ్యాయి.

యువహీరో రానా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. 'మీలో ఎంతమంది ఈ చిత్రానికి సీక్వెల్‌ను కోరుకుంటున్నారు. నేను చేస్తాను' అని వ్యాఖ్యానించారు. సీక్వెల్‌ చేస్తే వెంకటేష్‌, రానా కలిసి నటించాలని చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.