లాభాల్లో స్టాక్ మార్కెట్లు 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు 

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇవాళ  లాభాల‌తో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 199 పాయింట్ల లాభంతో 38,270 వద్ద, నిఫ్టీ 57పాయింట్ల లాభంతో 11,260 వద్ద కొనసాగుతున్నాయి. బుధ‌వారం భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ‌ లాభాలతో జోరందుకున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ భేటీ, అంతర్జాతీయంగా సానుకూల‌త నేప‌థ్యం, దేశీయంగా కంపెనీల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగు వేశారు. ఇవాళ‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, డాబర్‌ ఇండియా వంటి 403 సంస్థలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న నేప‌థ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.
షాపర్స్‌ స్టాప్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, ఓమెక్స్‌, జైప్రకాశ్‌ అసోసియేట్స్‌, ఐడీబీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల బాట ప‌ట్ట‌గా..ఐనాక్స్‌ లేజర్‌, హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటా, భారత్‌ పెట్రోలియం, ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేట్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.