భారత్ ను వణికిస్తున్న కరోనా

CORONA INCREASED IN INDIA

దేశంలో కరోనా మరణాలు 34 వేలు దాటాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం బుధవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 768 మంది మృతి చెందారు. క్రితం రోజు కంటే 114 మంది ఎక్కువగా చనిపోయారు. దీంతో మొత్తం మరణాలు 34,193కి చేరాయి. కొత్తగా 48,153 మంది వైరస్‌ బారినపడ్డారు. వరుసగా ఏడో రోజు దేశంలో 45 వేలపైగా కేసులు వచ్చాయి. అత్యధికంగా 35,286 మంది కోలుకోవడంతో రికవరీల సంఖ్య 9,88,029కు చేరింది. రికవరీ రేటు 64.51 శాతానికి పెరిగినట్లు కేంద్రం తెలిపింది. మరణాల రేటు 2.23 శాతానికి తగ్గిందని పేర్కొంది. ఏప్రిల్‌ 1వ తేదీ తర్వాత ఇదే తక్కువని చెప్పింది.
మంగళవారం 4.08 లక్షలపైగా పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. మహారాష్ట్రలో మరో 9,211 కేసులు రావడంతో మొత్తం సంఖ్య 4 లక్షలు దాటింది. మధ్యప్రదేశ్‌ బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి రాంఖెల్‌వన్‌ పటేల్‌కు కరోనా సోకింది. మణిపుర్‌లో కొవిడ్‌ తొలి మరణం నమోదైంది.