ట్రంప్ భద్రతా సలహాదారు‌కు కరోనా

TRUMP SECURITY ADVISOR AFFECTED BY CORONA

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఒబ్రెయిన్‌కు కరోనా సోకింది. ఇప్పటివరకు కరోనా సోకిన అతున్నత స్థాయి అధికారి ఈయనే. ఒబ్రెయిన్‌కు కరోనా సోకిన విషయాన్ని వైట్‌ హౌస్‌ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఒబ్రెయిన్‌కు తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నాయని.. ప్రస్తుతం సురక్షిత ప్రాంతంలో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నాడని పేర్కొన్నాయి.
అయితే అధ్యక్షుడుకి, ఉపాధ్యక్షుడికి రిస్క్‌ ఏమి లేదని.. జాతీయ భద్రత మండలి నిరంతరాయంగా విధులు కొనసాగిస్తుందని వైట్‌ హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. బ్రెయిన్‌ ఇటీవల ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరయ్యారని.. ఆ తర్వాతే అతనికి కరోనా సోకినట్టు నిర్దారణ అయిందని వార్తలు వెలువడుతున్నాయి.