ఐసీసీ వరల్డ్‌కప్ షెడ్యూల్

ICC ANNOUNCED WORLD CUP SCHEDULE

ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్యలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను కరోనా కారణంగా ఐసీసీ వాయిదా వేసింది. దీనితో బీసీసీఐకు మార్గం సుగమం కాగా.. ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబర్ 26 నుంచే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 2021-23 వరకు వరుసగా జరగనున్న ఐసీసీ వరల్డ్‌కప్‌ల షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.
కాగా, ఐసీసీ నుంచి వచ్చిన ఈ ప్రకటనతో త్వరలోనే బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే అక్టోబర్- నవంబర్ విండో మధ్య ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా..
ఫ్రాంజైజీలు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తున్నారు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఐపీఎల్ 13వ సీజన్ విదేశాల్లోనే జరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. యూఏఈలో జరుగుతుందని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ 2021: వచ్చే ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్య జరుగుతుంది. నవంబర్ 14, 2021 ఫైనల్. వేదిక: ఇండియా

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ 2022: 2022వ సంవత్సరం అక్టోబర్- నవంబర్‌లో జరుగుతుంది. నవంబర్ 13, 2022 ఫైనల్. వేదిక ఆస్ట్రేలియా

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ 2023: 2023వ సంవత్సరం భారత్ వేదికగా అక్టోబర్- నవంబర్‌లో జరుగుతుంది.