కుల్గామ్ లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం 

కుల్గామ్ లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం 

జమ్ముకశ్మీర్‌లో ఇవాళ‌ ఉదయం భ‌ద్ర‌తాద‌ళాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతాదళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టు బెట్టాయి. కాశ్మీర్ జోన్ పోలీసులు ఈ వివరాలు తెలిపినట్లు ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది. ఉగ్రమూకలు ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అని భారత్ సరిహద్దుల్లో నక్కి ఉన్నాయి. గత నెల రోజులుగా చైనా, భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదుల కదలికలు పసిగట్టిన కాశ్మీర్ పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. కాశ్మీర్‌లోని కుల్గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు భద్రతా సిబ్బంది స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదుల కదలికలతో అప్రమత్తమైన పోలీసులు, భద్రతా బలగాలు నగ్నాడ్ - ఛిమ్మెర్ కూంబింగ్ ప్రారంభించాయి. కాల్పులకు తెగబడుతున్న ఉగ్రవాదులపై భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు చేసి ధైర్యంగా వారి చర్యను తిప్పికొట్టింది. ఎన్‌కౌంటర్‌లో తొలుత ఓ ఉగ్రవాదిని కాల్చి చంపిన సిబ్బంది, మరికాసేపటికి మరో ఉగ్రవాదిని సైతం మట్టుపెట్టారు. ఆ ప్రాంతంలో ఇంకా ఎన్ కౌంట‌ర్ కొన‌సాగుతున్న‌ట్లు స‌మాచారం.