బ్రెజిల్ అధ్య‌క్షుడికి మ‌రోసారి క‌రోనా 

బ్రెజిల్ అధ్య‌క్షుడికి మ‌రోసారి క‌రోనా 

గ‌తంలో ఓసారి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు కరోనా సోకిన విష‌యం విదిత‌మే. అయితే ఆయ‌న మ‌రోసారి క‌రోనా వైర‌స్ బార‌ని ప‌డ్డారు. ఆయనకు గతంలో రెండు సార్లు చేసిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా, మూడో పరీక్షలో పాజిటివ్ అని తేలింది. నాలుగు రోజుల కిందట ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఇంట్లోనే నిర్బంధంలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే ఆయనకు లక్షణాలు తగ్గడంతో మరోసారి కోవిడ్ పరీక్షలు చేశారు.. అయితే రెండోసారి కూడా ఆయన నివేదిక పాజిటివ్ అని తేలింది. తనకు రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం గృహ‌ నిర్బంధంలో ఉన్నాను అంటూ ట్వీట్ చేశారు.