అనారోగ్యంతో నెల్సన్‌ మండేలా కుమార్తె మృతి

NELSEN MANDELA DAUGHTER DIED

నల్లజాతి సూరీడు, సౌతాఫ్రికా మాజీ ప్రెసిడెంట్ నెల్సన్‌ మండేలా కుమార్తె జిండ్జీ (59) తుదిశ్వాస విడిచారు. జోహన్నెస్‌బర్గ్‌ ఆస్పత్రిలో సోమవారం (జులై 13) ఆమె ప్రాణాలు విడిచినట్లు విడిచినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆమె మరణానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జిండ్జీ మండేలా ప్రస్తుతం డెన్మార్క్‌లో సౌతాఫ్రికా రాయబారిగా పనిచేస్తున్నారు. ఆమె మృతితో దక్షిణాఫ్రికాలో విషాద ఛాయలు అలముకున్నాయి.

నెల్సన్‌ మండేలా, రెండో భార్య విన్నీలకు కలిగిన సంతానం జిండ్జీ. మండేలాతో కలిసి విన్నీ వర్ణ వివక్షపై కదం తొక్కారు. మండేలా జైలు నిర్బంధంలో ఉన్నప్పుడు ఆయన విడుదల కోసం విన్నీ మండేలా తీవ్రంగా ప్రయత్నాలు సాగించారు. అయితే.. 1992లో ఆమె మండేలా నుంచి దూరమయ్యారు. 1994లో మండేలా సౌతాఫ్రికా ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత విన్నీ ఆయన వద్ద మంత్రిగా పనిచేశారు.