కరోనా లక్షణాలను ఇలా గుర్తించండి

THESE ARE CORONA SYMPTOMS

కరోనా వైరస్ సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ అందరికి సోకుతోంది, అయితే ఈ వైరస్ పాజిటీవ్ వచ్చిన వారు అసలు తమకు కరోనా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు, కొంత మందిలో లక్షణాలు కనిపిస్తే మరికొంత మందిలో లక్షణాలు కనిపించడం లేదు.
అయితే నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు, అసలు మన శరీరంపై ఈ వైరస్ అటాక్ చేసింది అని తెలిపే సూచనలు ఏమిటి అనేది చెబుతున్నారు, ముందుగా ఫీవర్ వచ్చినా పొడిదగ్గు వచ్చినా సాధారణ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి 48 గంటల్లో మీకు ఆ తీవ్రత తగ్గాలి కొంచెం తగ్గకపోయినా అశ్రద్ద చేయకూడదు.
అంతేకాదు ఈ వైరస్ అటాక్ అయితే పొడి దగ్గు వస్తుంది, జ్వరం కూడా తీవ్రంగా ఉంటుంది.తలనొప్పి కండరాల నొప్పి ఉంటుంది, రాత్రి పూట చెమట ఆయాసం వస్తుంది..
మీరు ఏ ఆహరం కూడా వాసన చూడలేరు, ఏది తిన్నా కొందరికి వాంతులు అవుతాయి.. రోజు నాలుగు ఐదు సార్లు విరోచనాలు అవుతాయి, డయేరియా వస్తుంది, ఇవి అందరికి ఉండ కపోవచ్చు కొంత మందిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి, ఏ లక్షణాలు అయినా మీరు సాధారణ మందులు వేసుకున్న 48 గంటలు దాటి తగ్గకపోయినా వెంటనే కోవిడ్ గా అనుమానించండి.