నేపాల్‌లో భారీ విలయం

nepal in struggle

నేపాల్‌లో ప్రకృతి ప్రకోపించింది. విలయాన్ని సృష్టించింది. భారీ వర్షాలు.. నేపాల్ పశ్చిమ ప్రాంతాన్ని ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదల వల్ల ఒకదాని వెంట ఒకటిగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. గ్రామాలకు గ్రామాలను తుడిచి పెట్టేస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనలో నేపాల్‌లో ఇప్పటిదాకా 60 మంది మృత్యువాత పడ్డారు. 41 మందికి పైగా అదృశ్యం అయ్యారు. వారంతా మరణించి ఉండొచ్చనే అనుమానాలు ప్రాథమికంగా వ్యక్తమౌతున్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. అధికారలు వారికి పునరావసాన్ని కల్పించారు.

కొండచరియలు విరిగిన పడినలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా అధికారులు అనుమానిస్తున్నారు. 41 మందికి పైగా గల్లంతు అయ్యారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. మ్యాగ్డీకి ఆనుకునే ఉన్న జిల్లాల్లోనూ ఇవే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా.. మున్ముందు మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు నేపాల్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా కొండచరియలు విరిగి పడే అవకాశం ఉన్న గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. వారి కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు.