కారు ఢీకొట్టడంతో ఎస్పీవో మృతి

DSPO DIED IN ACCIDENT

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన బి.అజయ్‌కుమార్‌(42) ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీవోగా పని చేస్తున్నారు. ఆర్మీలో పదవీ విరమణ చేశాక ఉప్పల్‌లో ఏడేళ్ల క్రితం ఎస్పీవోగా చేరారు.
శుక్రవారం కానిస్టేబుల్‌ ఉపేందర్‌తో కలిసి బైకుపై హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో పెట్రోలింగ్‌ చేస్తున్నారు. వెనక నుంచి వచ్చిన ఓ కారు వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఎస్పీవో తలకు బలమైన గాయమైంది. కానిస్టేబుల్‌ కు ముఖానికి, చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఎస్పీవో మృతి చెందాడు. ఆయన మృతి పట్ల ఏసీపీ నరసింహారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ రంగస్వామి, ఎస్సైలు జయరాం, మైబెల్లి, చందన సంతాపం తెలిపారు.